IPL – 2015 ఎలా ఉంటుంది?
04/22/2010
ఏప్రల్ 22,2015 08.15
BPL వారి APL (Andhra Premier League) 2015 F5 లో సెమీఫైనల్ మ్యాచు.
టెక్కలి టైగర్స్ V/S రామగుండం రేంబోస్
టెక్కలి టైగర్స్ తరఫున, టాటా స్కై టాప్ క్లాస్ టాస్ గెలిచి బార్నవిటా బ్యాటింగ్ ఎంచుకున్నాడు కార్బన్ మొబైల్ కమాల్ కెప్టెన్ కమలాకర్
ఒంటి నిండా యాడ్లతో అక్కడక్కడా కనిపించే అదోరకమైన రంగు కలిగిన వాళ్ళ టీము జెర్సీ వేసుకొని బ్యాటింగుకి దిగారు ఒనిడా సమర్పించు ఓపెనింగు బాట్స్ మన్
మొదటి బంతి – జి.ఎం.ఆర్ వారి జిడ్డు బంతి (అనగా డాట్ బాల్)చేశాడు బాట్స్ మన్
రెండో బంతి – సింగపూర్ ఎయిర్ లైన్స్ సమర్పించు సూపర్ సింగిల్.
ఇంతలో బ్రూ స్ట్రాంగ్ కాఫీ స్ట్రాటజిక్ టైం అవుట్ (ఈ టైములో టీవీలో రెండు యాడ్లు)
స్ట్రాటజిక్ టైములో, “ఇంత స్లోగా ఆడితే RBS బ్యాంకు సమర్పించు రన్ రేటు తగ్గిపోతుంది”, అని రెండు చీవాట్లేసి వాళ్ళ టీము డ్రింకు అయిన రస్నా తాగించి వచ్చాడు కార్బన్ మొబైల్ కమాల్ కెప్టెన్ కమలాకర్ (కా.మొ.క.క.కమలాకర్).మరి వాళ్ళ టీములో రంజీ ట్రొఫీ మ్యాచులు చూసిన అనుభవం ఉన్నది అతనొక్కడికే.
మూడో బాలు – కెప్టెన్ చీవాట్లు పనిచేశాయేమో,బాట్స్ మన్ కంఫర్ట్ డిటర్జెంట్ కంఫర్టెబుల్ ఫోరు కొడదాము అనుకొని ముందుకు వస్తే, ఆ బాలు కాస్తా ఇండిగో నేషన్ వారి ఇన్ స్వింగర్ అయ్యి మ్యాగి మిడిల్ స్టంప్ ని తాకింది.
వికట్టు మీద బెయిల్సు లెగకుండానే టీవీలో మూడు యాడ్లు వచ్చేసాయి.
టెక్కలి టైగర్స్ 2 లక్షలకు మొన్నే కొన్న కజకిస్తాన్ క్రికెట్ స్టార్ సాయిబ్ మోలిక్ ని బ్యాటింగుకు దింపాడు కా.మొ.క.క.కమలాకర్
నాలుగో బాలు – సోనీ సూపర్ సిక్సు కొట్టబోయి బౌండరీ దగ్గర ఉన్న నైజీరియా ఆటగాడు మాగాయ తింటీనీ కి కోంపాక్ వారి కంపాక్ట్ కాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మన స్టార్ బాట్స్ మన్.
టీవీలో మూడు యాడ్లు
ఇక తప్పదు అనుకొని,మన కా.మొ.క.క. కమలాకర్ రంగం లోకి దిగాడు.
అయిదో బాలు వెయ్యడానికి బౌలర్ బౌండరీ వరకూ నడుచుకు వెళ్తున్నాడు.ఇదే టైము అనుకొని మన కమలాకర్ తన కంప్యూటర్ లో ఆడిన క్రికట్ ఙానాన్ని అంతా ఉపయోగించి టొయోటా ఫ్రంట్ ఫుట్ డ్రైవు ఆడదామా? ITC స్క్వేరు కట్ ఆడదామా అని తను కట్టుకున్న పల్సర్ ప్యాడు లోపల ఉన్న మోకాలినంతా ఉపయోగించి ఆలొచిస్తున్నాడు.
టీవీ కెమెరా ప్యాన్ అయ్యి పార్లే గ్లూకోసు వారి పెవీలియన్ లో కూర్చున్న వొడాఫోన్ వండర్ ఫుల్ కోచ్ లక్ష్మణ్ వైపు జూము అయ్యింది.
లక్ష్మణ్ దీర్ఘాలోచన లో ఉన్నాడు.ఇందాకే రేణిగుంట రేంజర్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది తనకి ఫోనులో.మన రాష్ట్రం నుంచి టెస్టుల దగ్గరి నుంచి F5 దాకా ఆడిన అనుభవం ఉన్న ఏకైక వ్యక్తి కావడం అతనికి బాగా కలిసి వస్తోంది.
తను ఆడతున్నప్పటి నుంచి క్రికట్ లో వస్తున్న మార్పులు అతడు చూస్తూనే ఉన్నాడు.మొదట టెస్టులు తగ్గించి వన్ డేలు పేంచారు.తరువాత టైము కలిసి వస్తుంది అని వన్ డేలు తగ్గించి T20 లు పెంచారు….
అప్పుడు వచ్చింది IPL.మొత్తం ఆట స్వరూపాన్నే మార్చేసింది.ఇన్నాళ్ళు తమ దేశం కోసం ఆడిన ఆటగాళ్ళు అందరూ, వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం ఆడటం మొడలు పెట్టారు.ఇందులో భాగంగా,పంజాబ్ కి శ్రీలంకా కెప్టెన్,కలకత్తాకి ఆస్ట్రేలియా కోచ్, ముంబై టీములో రాయుళ్ళు,చెన్నై టీములో సింగులు ఇలా మారిపోయింది.
కొన్నాళ్ళకి,ఈ 20 ఓవర్లు చూడడం కుదరదు అనుకొని దాన్ని 10 ఓవర్లకి కుదించి మధ్యలో యాడ్లు ఎక్కువ క్రికట్ తక్కువ గా మారింది. చివరకి స్పాన్సర్స్ ఒత్తిడితో 10 ఓవర్లను కూడా 5 ఓవర్లకు కుదించి F-5 (Five – 5) గా మార్చారు.
ప్రతి ఊరికీ ఒక టీము తయారు అయ్యింది.వాళ్ళ ఊరికి నీళ్ళు లేక పొయినా పర్వాలేదు కాని క్రికట్ టీము మాత్రం ఉండాలి అని జనాలు అనుకునేవారు.దీంతో క్రికట్ టీముకి ఎవడు ఎక్కువ స్పాన్సర్ చేస్తాడో వాడికే ఓట్లు పడేవి.
ఇన్ని టీములు ఉండటంటో ముందు జిల్లా స్థాయిలో ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో, అందులో గెలిచిన టీములకి జోనల్సు, ఆ తరువాత జోన్ల మధ్య పోటీ పెట్టి, IPL విన్నర్ ని ఎంపిక చెయ్యడం మొడలు పెట్టారు.ఇన్ని మాచ్లు ఆడటం వలన అంతర్జాతీయ పోటీలకి టైము లేక,ఇండియా టీము అసలు ఆడటమే మానేసింది.
ఈ మాచులు చూపించడానికి ఓ 30 చానల్లు పెట్టారు IPL – A, IPL – B….అని
ఈ దెబ్బకి ఇంటికో క్రికటర్ తయారు అయ్యాడు.దాని వల్ల ఒలంపిక్స్ కి పంపించడానికి జనాలు లేక బాంగ్లాదేష్ నుంచి వచ్చిన కాందశీకులను పంపడం మొదలు పెట్టారు భారత ప్రభుత్వం వారు.
ఆట వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కడూ రంగంలోకి దూకెయ్యడంతో తెలుగు సినిమా హీరోయిన్లు 1,2 సినిమాలు చేసి తమిళ్ సినిమాలకు వెళ్ళినట్టు ఆటగాళ్ళు అందరూ 1,2 మాచ్లు ఆడి పక్క టీముకి చెక్కేయడం మొదలుపెట్టారు.
ఇక కొన్ని సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళకి కూడా F5 పోటీలు మొదలు పెట్టారు.కాని అవి సీరియల్సు వచ్చే చానళ్ళలో ఇస్తున్నారు అని,ఇది పురుషాహంకారానికి నిదర్శనమని మహిళా సంఘాలు గోల చెయ్యడంతో రిజర్వేషన్ కింద వాళ్ళకో 10 చానళ్ళు ఇచ్చేసారు.
వచ్చే సంవత్సరం తానే ఒక టీము కొంటే ఎలా ఉంటుంది అని గట్టిగా ఆలొచిస్తున్న లక్ష్మణ్ కి మొహం మీద తడి తడి గా అనిపించింది.
కొంప దీసి వీడియోకాన్ వర్షం బ్రేకు కాదు కద అనుకున్నాడు….
“బాబూ….లెగు,లెగు…..మనం మ్యాచు గెలిచాం,అందరూ గ్రౌండ్ చుట్టూ పరిగెడుతున్నారు….నువ్వు ఆడకపొయినా పరిగెత్త కుండా పడుకుంటే ఫాన్సు ఫీలు అవుతారు”, అని అసిస్టెంటు కోచు నిద్ర లేపడంతో ఆ వైష్ణవ మాయలోంచి బయటకు వచ్చి తన టీము వాళ్ళతో పరిగెత్తడం మొదలు పెట్టాడు లక్ష్మణ్.
(గమనిక:ఈ టపాలో పాత్రలు,కంపెనీలు అన్నీ కల్పితాలే,ఎవరికైన ఎక్కడో విన్నట్టు ఉంటే నాది బాధ్యత కాదు. rediff లో ఒక ఫోరంలో ఎవరో చేసిన కామెంటు ఆధారంగా)


04/22/2010 at 9:44 ఏ ఎమ్
చాలా సరదాగా ఉంది టపా. ఇవన్నీ నిజంగా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
04/22/2010 at 12:19 సాయంత్రము
అలా జరగకూడదు అనే అనుకుంటున్నాను.సిసలైన టెస్టు మ్యాచులో ఉన్న మజా ఈ 20-20 లో ఎక్కడ ఉంది
టపా చదివినందుకు ధన్యవాదములు
- పవన్
04/22/2010 at 10:18 ఏ ఎమ్
LOL man… Rocks
04/22/2010 at 10:59 ఏ ఎమ్
hi
04/22/2010 at 12:20 సాయంత్రము
hi
- pavan
04/22/2010 at 12:20 సాయంత్రము
thanks man
- pavan
04/22/2010 at 10:58 ఏ ఎమ్
hey u this message wiil be feature………………………….
04/22/2010 at 12:20 సాయంత్రము
i think u r trying to say…future..
- pavan
04/22/2010 at 12:16 సాయంత్రము
బాగా రాసారు. ఇలా జరిగినా ఆశ్చర్యమేమీలేదు…మీ ఊహ బావుంది
04/22/2010 at 12:24 సాయంత్రము
ఇలా జరగకూడదు అనే అనుకుంటున్నాను. సిసలైన టెస్టు మ్యాచులో ఉన్న మజా 20-20 లో ఎక్కడ ఉంది.
టపా చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములు
- పవన్
04/22/2010 at 4:47 సాయంత్రము
మీ టపా కామెడి స్పిన్ బాగుంది. ఈసారి గూగ్లీ వేయండి.
04/22/2010 at 5:47 సాయంత్రము
ఈ సారి గూగ్లీయే వేస్తానో బౌన్సరే వేస్తానో మీరే చూస్తారు.
టపా చదివినందుకు,వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములు
- పవన్