ఆరంభ శూరత్వం
04/18/2010
ఎట్టకేలకు నేను కూడా ఒక బ్లాగు మొదలు పెట్టాను.అందరి బ్లాగులు చదివి అన్నీ కలిపి కలగూర గంపగా ఎక్కడ రాస్తానో అని ఇంకా భయంగానే ఉంది.ఏది అయితే అయ్యింది విజయమో,వీరస్వర్గమో ముందు ముందు తెలుస్తుంది.
ఇక ఈ టపాకి ‘ఆరంభ శూరత్వం’ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది.చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండేది మన వాళ్ళకి ఆరంభ శూరత్వం ఎక్కువ,పని చాలా బాగ మొదలు పెడతారు కాని పూర్తి చెయ్యరు అని.
ఈ విషయంలో నేనే ఒక పెద్ద ఉదాహరణ.
చెన్నైలో సాధారణంగా రాత్రి పూట భోజనం దొరకదు,ఎక్కడో పెద్ద హోటల్లలో తప్పిస్తే.అంతా పరోటాలు,తిఫిన్లే.మన వైపేమో రాత్రి భోజనాలు ఎప్పుడూ విందు భోజనాలే ఆయె (అలా తినకూడదట,సైన్సు చెప్తోంది,కాని ఈ బుజ్జి కడుపుకి అంత సెన్సు ఎక్కడిది).ఏమైనా అంటే అందరూ కలిసి తినేది అప్పుడే కద,అలాంటప్పుడు ఎందుకు కడుపు మాడ్చుకోవడం అంటారు.మా ఇంట్లో చెప్తే పెద్దైయ్యాక అలాగే చేద్దువ్వు గాని ఇప్పుడు తిను అని చెప్పి చిన్నప్పటి నుంచి అలవాటు చెసేసారు.
ఇక ఈ టిఫిన్లతో మనకి కుదరదు,మన పాకశాస్త్ర ప్రావీణ్యం ప్రదర్శించాలి అని ఒక ఘాట్టి నిర్ణయానికి వచ్చి ఒక రోజు ఆవేశంగా పాండి బజార్ శరవణ స్టోర్స్ కి వెళ్ళి వంట సామాను అంతా కొనేశా.మా ఇంటి దగ్గర ఉన్న రిలయన్స్ నుంచి కూరగాయలు కూడా కొన్నా.
మొదటి రోజు మా ఇంటి వంటలో ఐటం : ఆంధ్రా కర్రీ.
గాభరా పడకండి.ఆ మధ్య ఆ రెండు ఉద్యమాలూ మాంచి ఊపు మీద ఉన్న టైంలో చేసిన ప్రయోగం కనుక ఆ పేరు పెట్టాను.(ఆ కూర ఆ పేరు నిలుపుకుంది లెండి).
కావలసిన పదార్థాలు:
తెలంగాణా టమాట – ఎంత వేశానో గుర్తులేదు.
రాయలసీమ ఉల్లి గడ్డ – ఇది మాత్రం కష్టపడి ఏడుస్తూ ఒకటి కోసా
కోస్తా దొండకాయ – చేతికి వచ్చినన్ని కోసి వేసా
ఇతరత్రా సామాను
అన్నీ కలిపి ఒక బాణిలో వేసి చేతికి దొరికిన ఇతరత్రా సామాను వేసాను.
ఒక పావు గంట తరువాత,బాగ కలిపాక,కర్రీ తయారు అయ్యింది.
చూడడానికి బాగానే ఉంది.ఇంక హోటల్ తిండి ఎవడికి కావాలి,మనమే మూడు పూటలా కుమ్మేద్దాం అన్నుకున్నా.
ఇంకా ఈస్ట్ మన్ కలర్ లో ఫ్యూచర్లో ఒక తాజ్ రేంజ్ హోటల్ కూడా ప్లాన్ చేసా.
సరే వంట కార్యక్రమం అయ్యింది ఇంక విందు భోజనమే అని కూర్చున్నా.అన్నంతో కలుపుకు తింటే,అంతా బాగానే ఉంది కాని ఏదో తేడా.సమయానికి ఏదో తెలుగు వంటల సైటు తేరిచి ఉంది.అందులో అన్ని పదార్థాలు సరి చూసుకున్నా.నా చూపు ఒక్క చోట ఆగిపొయింది.
హతవిధీ!!! కూర వండితిని ఉప్పు మరచితిని !!!
బాగా ఆలొచిస్తే ఉప్పు కొనడమే మరచితిని.ఇంక అంత రాత్రి ఉప్పు ఎక్కడినుంచి తెస్తాంలే అని నా ప్రత్యేకతైన మ్యాగీ నూడల్స్ వండుకు తిన్నా.
(కూరకి ఆంధ్రా పేరు పెట్టినందుకు ఆరంభ శూరత్వం చూపించింది)
రెండో రోజు: ఉప్పు తీసుకు వచ్చా.కానీ కూర ఉడుకుతున్న టైములో ప్రతిపక్షాల కుట్ర వల్లన కూర మాడుతున్న వాసన వచ్చినా చూసుకోక ఈ రోజు మ్యాగీ సూపు చేసుకు తిన్నా.
మూడో రోజు: మా ఇల్లు ఉంది,ఇంట్లో వంట లేదు
నాలుగో రోజు: మా ఇంటి వంట కాస్తా ‘ఇంట్లో బంగాళా దుంపలూ,టమాటాలు పెంచడం ఎలా’ గా మారింది(అనగా కూరగాయలు అన్నీ కుళ్ళిపొయాయి)
ఆ తరువాత ఇంకా కొత్త వంటలు ఏవీ కల లోకి కూడా రానివ్వలేదు.(అవి వస్తే మళ్ళీ తాజ్ హోటల్ గుర్తుకు వచ్చి పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది అని)
మొత్తానికి అలా నిర్విఘ్నంగా నా వంట కార్యక్రమం ప్రారంభించి అంతే నిర్విఘ్నంగా నిలిపివేసాను.
ఇప్పుడీ బ్లాగు మొదలు పెట్టాను. ఇది కూడా ఆరంభ శూరత్వం కాకుండా నన్ను దీవించ ప్రార్థన.
కూడలిలో నా బ్లాగు జత పరిచినందుకు కూడలి టీం కి నా ధన్యవాదములు.


04/19/2010 at 12:39 ఏ ఎమ్
hello pavan , mee blog via kudali nundi chussanu..
vanta prayathnam gururnchi baga ne rasaru..
nijaniki , vanta antha kastam kadandi.., kakapothe
oopika kavali and time vundaali.
ila cheptunna ani , nenedo pakashastra pavinni kadulendi..
nenu n priyamitrilu try chessamu, inka chaalu anukunnamu..
ippudu bangalore chennai maid arrange chesukuunamu..
maid garu , thana tamil style cookings tho bagane try chestundi.
04/19/2010 at 2:13 సాయంత్రము
mee comment ki dhanyavaadamulu,
ee saaari baaga raayadaaniki prayatnistaanu.
meeru koodaa jihva baadhitulenaa.ayinaa bangalore koncham better andi, akkadakkada telugu hotels kanipistayi.
- Pavan
04/19/2010 at 2:11 ఏ ఎమ్
first postతోనే అదరగొట్టావ్ బాస్…కుమ్మెయ్ ఇక…
04/19/2010 at 2:17 సాయంత్రము
thanks బాస్.
మీ అభిమానం ఉంటే తప్పకుండా అలాగే చేద్దాం
- పవన్
04/19/2010 at 11:22 ఏ ఎమ్
welcome to the blog world !
04/19/2010 at 2:14 సాయంత్రము
thank you sowmya gaaru
- Pavan
04/19/2010 at 11:25 ఏ ఎమ్
బ్లాగ్ లోకానికి స్వాగతం. మీరు మీ ఇంటి వంటని టమాటతో ప్రారంభించారు. అందుకే అలా అయ్యింది. అదే ఆంధ్రుల అభిమాన కూర రాజం వంకాయతో చేసుంటే మరి విజయం లభించేదేమో. ఏది ఏమైనా మీ ఇంటి వంట ఘుమఘుమలాడాలని ఆశిస్తూ… శ్రీవాసుకి
04/19/2010 at 1:58 సాయంత్రము
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములు
నాకు వంకాయతో చేసే కూరలలో గుత్తి వంకాయ ఒకటే నచ్చుతుంది.పాక శాస్త్రంలో చేతులు తిరిగిన,కొమ్ములు తిరిగిన వాళ్ళకే అది తిన్నంగా రాదు.ఇంక నేను ఎక్కడ చెయ్యగలను.కాని మీ సూచన మేరకు త్వరలోనే ప్రయత్నిస్తాను.ఎలాగో దాన్ని ప్రయోగించడానికి మా కొలీగ్స్ ఉన్నారు కద
- పవన్
04/19/2010 at 12:53 సాయంత్రము
Best of luck…
04/19/2010 at 1:59 సాయంత్రము
thank you