అందరికీ నమస్కారం.
ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం తో నా అనుబంధం, నాకు చాలా ఇష్టమైన ఈనాడు పత్రికతో వచ్చే ఆదివారం అనుబంధంలో వచ్చిన ఒక చిన్న వ్యాసం తో మొదలయ్యింది. అది అబ్రకదబ్ర గారి బ్లాగ్ గురించి.
ఎప్పుడో 2 సంవత్సరాల క్రిందట ఎక్కడ చూసినా బ్లాగుల గురించే.మనమూ ఒక రాయి వేద్దాం అని ఒక బ్లాగ్ రాశా “బిజినెస్స్ కాల్ద్ లైఫ్” అని. ఒక రెండు పోస్టుల తరువాత ఏమి రాయలో తెలియక, రాయడానికి సమయం లేక, ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే సరి అయిన దిశానిర్దేశం లేక కలం ముందుకి కదల లేదు.
ఆ తరువాత కాలక్రమం లో చాలమంది నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బ్లాగు లొకాన్ని ఏలుతున్నారు అని తెలిసింది. ఒక్కసారిగా నాకూ ఒక విధమైన రచనావేశం కలిగింది. కాని మళ్ళీ అదే సమస్య ఏమి రయాలి.
మొదటగా అబ్రకదబ్ర గారి బ్లాగ్ ఒకటి చదివాను.నిజం చెప్పొద్దూ,నాకు చాలా నచ్చింది.మెల్లమెల్లాగా ఆ బ్లాగ్ లో ఉన్న అన్ని వ్యాసాలు చదివా. ఆ తరువాత మెల్లగా కూడలి, అక్కడి నుంచి కూడలిలో మెల్లగా ఒక్కోక్క బ్లాగ్ చదవడం మొదలు పెట్టా.ఎందరివో బ్లాగులు చదివా.
చాలా మందివి పేర్లు గుర్తులేవు.ఏమీ అనుకోవద్దు.ఆ బ్లాగులలో ఉన్న,నాకు నచ్చిన విషయాలు చెప్తాను,దాని బట్టి అర్ధం చెసుకోగలరని మనవి.
నాకు బాగా గుర్తున్న బ్లాగులలో హరే-ఫలా పేరుతో ఫనిబాబు గారు రాసే బ్లాగు.జీవితాన్ని కాచి వడబోసి ఒక గ్లాసులో వేసి తాగటానికి ఇచ్చినట్టు ఉంటాయి ఆయన పోస్టులు.
తరువాత నెమలికన్ను బ్లాగ్,రెండు రెళ్ళు ఆరు…. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డు బ్లాగులు చదివా.ఒక ప్రభుత్వ ఉద్యోగిని బ్లాగు,ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి బ్లాగు..ఇలా పేరు గుర్తులేని బ్లాగులు కూడా బొల్డు.
ఇక తెలుగులో బ్లాగడానికి కారణం తెలుగంటే నాకు చాలా ఇష్టం,ఎందుకో తెలియదు.నేను తెలుగు నేర్చుకుంది 8వ క్లాసులో.తెలుగు చదివింది 10వ క్లాసు వరకు.ఆ తరువాత మార్కుల వేటలో తెలుగుని ఎక్కడో కోల్పోయాను.ఆ తరువాత ఎంత చదివినా,మార్కుల కోసం తెలుగు చదవలేదు.బహుశా అందుకే తెలుగంటే ఇష్టమేమో.
తెలుగు చదివాను అంటే ఏ గ్రంధాలో కాదు,చదివింది వార పత్రికలు,దిన పత్రికలు.ఆ తరువాత ఈ మధ్య చదువుతోంది కూడలిలో బ్లాగులు.
మొత్తానికి కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు,నేను బ్లాగడానికి వెయ్యిన్నొక్క కారణాలు.
నా బ్లాగు మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ,ఎక్కడైన అక్షర దోషాలుంటే మన్నించమని కోరుతూ
మీ పవన్.
Like this:
Be the first to like this post.